ATP: అనంతపురం మేయర్ అభ్యర్థిగా బీజేపీ నేత అజేష్ యాదవ్ కోర్టు రోడ్డు నుంచి టవర్ క్లాక్ మీదుగా భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి, అభివృద్ధికి పట్టం కడతామని నేతలు ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కోలాహలంగా బీజేపీ మేయర్ అభ్యర్థి నామినేషన్


