TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆలపాటి గిరిధర్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ రమేశ్, ఏవీఎస్వో శ్రీహరి రావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న న్యాయమూర్తి కుటుంబానికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి


