హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

ప్రకాశం: జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో ఆదివారం మద్యం బెల్టుషాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తి వద్ద నుంచి 16 క్వార్టర్ల మద్యం సీసాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించి అధికారులు కేసు నమోదు చేయించారు.