హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా అంజనీ దేవి నామినేషన్

E.G: కొవ్వూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ YCP అభ్యర్థిగా గండ్రోతు అంజనీ దేవి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. అధిష్ఠానం మొదట నిర్ణయించిన మన్నే పద్మ కూడా ఆమె వెంట వెళ్లి నామినేషన్ వేయించారు. ముందుగా మాజీ MLC కోడూరి శివరామకృష్ణ ఆశీస్సులు తీసుకొని, ఆయన చేతుల మీదుగా పత్రం స్వీకరించారు. గత వారం రోజులుగా సాగిన తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ అభ్యర్థి ఎంపిక ఎట్టకేలకు ఖరారు అయింది.