హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ దాఖలు చేసిన మేయర్ అభ్యర్థి

కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ పదవికి ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ, కొనకళ్ల బుల్లయ్య పాల్గొన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంతో మచిలీపట్నం నగర రాజకీయాల్లో మేయర్ పదవిపై ఆసక్తి నెలకొంది.