అన్నమయ్య: రాజంపేట మున్సిపల్ ఎన్నికలను రద్దు చేసి, తిరిగి నోటిఫికేషన్ విడుదల చేయాలని MLA ఆకేపాటి అమర్నాథరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి గొడవలు సృష్టించారని ఆరోపించారు. స్థానిక ప్రజలను అవమానపరిచేలా వ్యవహరించారని మండిపడ్డారు. రాజంపేట ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'రాజంపేట మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయాలి'


