హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తిలో టీడీపీ నాయకుల సంబరాలు

ATP: గుత్తి పట్టణంలో ఆదివారం టీడీపీ నాయకులు సంబరాలు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా పలు వార్డుల్లో వైసీపీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో టీడీపీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. దీంతో పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, 'జై చంద్రబాబు జై జై చంద్రబాబు' అంటూ నినాదాలు చేశారు.