హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షం పడితే బురదమయం

AKP: నక్కపల్లి మండలం ముకుందరాజుపేట వంతెన వర్షం పడితే బురదమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముకుందరాజుపేట, దోసలపాడు అగ్రహారం, రాబాక తదితర గ్రామాల ప్రజలు ఈ వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాలు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతున్నారు.