హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజువాక జోనల్ కార్యాలయాన్ని సందర్శించిన సీపీ

విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదివారం గాజువాక జోనల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్వహణ, సిబ్బంది విధులు, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో మాట్లాడి విధుల నిర్వహణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై పలు సూచనలు చేసినట్లు సమాచారం.