హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలుకే సొంతమైన సంప్రదాయ ఉత్సవం

ప్రకాశం: ఒంగోలుకు పరిమితమైన 'కళారాల ఊరేగింపు' 400 ఏళ్ల పురాతన సంప్రదాయం. దసరా నవరాత్రుల్లో దుర్గాష్టమి, మహర్నవమి రాత్రుల్లో ఈ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సుమారు 200 కేజీల బరువుండే రాగి లోహపు అమ్మవార్ల ముఖరూపాలను (కళారాలు) భక్తులు నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ అరుదైన సాంప్రదాయ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రజలు ఏటా పెద్దఎత్తున ఇక్కడికి చేరుకుంటారు.