హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పగిడ్యాలలో వర్షాలతో రైతుల్లో ఆనందం

NDL: పగిడ్యాల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వారం క్రితం కురిసిన వర్షాలకు రైతులు జొన్న, శనగ, నువ్వు పంటలు సాగు చేశారు. మరికొందరు సాగుకు సిద్ధమవుతున్న సమయంలో మళ్లీ వర్షం పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం పంటలకు మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.