హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

అన్నమయ్య: కారు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గుర్రంకొండ మండలంలో జరిగింది. రామాపురం పంచాయతీ, గంగిరెడ్డిగారిపల్లిలో గంగమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే చూసేందుకు వస్తున్న లక్క కోల్లపల్లికి చెందిన కె.రెడ్డెప్పను తరిగొండకు చెందిన వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. తలకు గాయం కావడంతో వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.