హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వావిలివలసలో ఆంజనేయ చెరువు వద్ద శ్రమదానం

VZM: రేగిడి మండలం వావిలివలస గ్రామంలోని ఆంజనేయ చెరువు వద్ద సామాజిక కార్యకర్త పాలూరి సిద్ధార్థతో పాటు పలువురు యువకులు శ్రమదానం చేపట్టారు. చెరువులో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ, పరిసరాల్లోని పిచ్చి మొక్కలను శుభ్రం చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వారు తెలిపారు.