హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారినే ఎన్నుకోండి.

PPM: కొమరాడ మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నుకోవాలని సీపీఎం కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం బంగారంపేట గ్రామ సమీపంలో పార్వతీపురం–కూనేరు అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గోతులను పరిశీలించిన ఆయన, ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.