కోనసీమ: మండపేట పురపాలక సంఘ ఎన్నికల్లో భాగంగా 35వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్, పట్టణ కన్వీనర్ పిల్లి శ్రీనివాస్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆలమూరు రోడ్డులో గల అన్నపూర్ణ స్కూల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో ఎన్నికల అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
35వ వార్డు వైసీపీ అభ్యర్థిగా పిల్లి శ్రీనివాస్ నామినేషన్


