హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పట్నాన సాయిశ్రీ.

పార్వతీపురం పురపాలక సంఘ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పట్నాన సాయిశ్రీని ఖరారు చేశారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తన క్యాంపు కార్యాలయంలో ఆమెకు పార్టీ బి-ఫారం అందజేశారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోగారావు తెలిపారు.