హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కోటప్పకొండలో భవ్య హాసిని నృత్య నీరాజనం

PLD: కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి క్షేత్రంలో నెల్లూరుకు చెందిన భవ్య హాసిని ఆదివారం తెల్లవారుజామున భరతనాట్యంతో నృత్య నీరాజనం సమర్పించింది. కోటప్పకొండ దిగువ నుంచి కొండపై ఉన్న స్వామివారి ఆలయ సన్నిధి వరకు నృత్యం చేస్తూ చేరుకుంది. సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ఆమె చేస్తున్న ఈ ఆధ్యాత్మిక యాత్రను చూసిన భక్తులు అభినందించారు.