హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామ స్వతంత్ర అభ్యర్థిగా షేక్ రఫీ

NTR: నందిగామ పురపాలక ఎన్నికల్లో 22వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా షేక్ రఫీ (ఆటో మెకానిక్) ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల్లో మంచి పట్టున్న యువనేతగా ఆయనకు పేరుంది. 'వార్డును నందనవనం చేస్తా, డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు వంటి సమస్యలు పరిష్కరిస్తా' అని హామీ ఇచ్చారు. ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం సాగిస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది.