హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మీడియా కేంద్రాలను పరిశీలించిన అధికారులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ (ఎంసీఎంసీ), మీడియా రూమ్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎ. భార్గవ తేజ, వ్యయ పరిశీలకులు, ఏలూరు డీఐఎఫ్ పి. వెంకట సందీప్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల నిర్వహణ, మీడియా పర్యవేక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.