హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభ్యర్థిని గెలిపించి జగన్‌కు బహుమతి ఇద్దాం'

సత్యసాయి: స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డా. బత్తల హరిప్రసాద్ కోరారు. కదిరి వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఐదు రోజులు పార్టీకి అండగా ఉంటే, ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తామన్నారు. కదిరి నుంచి జడ్పీ చైర్మన్‌ను గెలిపించి జగన్‌కు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు.