అన్నమయ్య: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ముగింపు సందర్భంగా బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో డీఎస్పీ బి.ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు, ఏఆర్, స్పెషల్ పార్టీ బలగాలను మోహరించారు. డ్రోన్లతో నిఘా ఉంచామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు


