BHNR: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండగ పల్లెపల్లెనా వెల్లివిరుస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా సంబరాల్లో ఎనిమిది రోజులపాటు ఆడి పాడిన వారు నేడు తొమ్మిదోరోజు ‘సద్దుల బతుకమ్మ’ వేడుకను ఘనంగా జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగ, ఉపాధి, చదువుల రీత్యా ఎక్కడెక్కడో ఉన్నవారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సొంతూళ్లకు చేరుకుంటున్నారు.
తెలంగాణ
బతుకమ్మ సంబరాలకు ముస్తాబైన పల్లెలు


