హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ మేయర్ అభ్యర్థిగా భార్గవి నామినేషన్

VZM: తనను ఇంటి ఆడపిల్లగా భావించి ఆశీర్వదించాలని టీడీపీ మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి కోరారు. ఆదివారం ఆమె మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి బాటలు వేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొని అవనాపు భార్గవికి తమ మద్దతు తెలిపారు.