హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావులపల్లి రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

RR: శంకర్‌పల్లి మండలంలోని రావులపల్లి రోడ్డు పనులను, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇవాళ పరిశీలించారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్, వార్డ్ మెంబర్లు, పీఎసీ వైస్ ఛైర్మన్ బొల్లారం వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.