హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేపల కోసం వెళ్లిన వ్యక్తి మృతి

MDK: పెద్దశంకరంపేట(M) అయ్యవారికుంటలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెద్దశంకరంపేట గ్రామానికి చెందిన ఔదగిరి బేతయ్య(45), తండ్రి బాలయ్యతో కలిసి చేపలు పట్టేందుకు కుంటలోకి వెళ్లి నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడు బెస్త సామాజిక వర్గానికి చెందినవాడని, చేపలు పట్టడం వృత్తిగా జీవనం సాగిస్తున్నాడని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి  వివరాలు తెలియాల్సి ఉంది.