NLG: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భవానీ మాలధారణ స్వాములు అమ్మవారికి భజనకీర్తనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు దుర్గామాత అనుగ్రహం ప్రజల అందరిపై ఉండాలని అమ్మవారిని పూజించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు


