హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువు నిర్వాసితుల సమస్యలపై సీపీఎం పోరాటం

WNP: బుద్ధారం పెద్ద చెరువు భూనిర్వాసితులకు రూ.47.25 లక్షల పరిహారం ఇవ్వాలని సీపీఎం నాయకులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. పరిహారం పెంపుపై చర్చిస్తామని, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. డిమాండ్లు నెరవేరే వరకు రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తామని సీపీఎం నాయకులు స్పష్టం చేశారు.