హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహాదుర్గ అలంకారంలో అమ్మవారు

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఎనిమిదో రోజు శ్రీభ్రమరాంబిక అమ్మవారు మహాదుర్గ (గౌరి) అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, ఉపనిషత్‌ పారాయణాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సుధాకర్‌, అర్చకులు, వేద పారాయణదారులు పాల్గొన్నారు.