హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా దేవి బోనాలు మహోత్సవం

SRD:​ కంగ్టి మండలం దెగులవాడి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బోనాల పండుగ మహోత్సవాన్ని ఇవాళ అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామస్థులు మంగళ వాయిద్యాలు, భాజా భజంత్రీలతో గ్రామం నుంచి ఊరి బయట వెలసిన భవాని మందిరం వరకు ఘనంగా ఊరేగింపుగా వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.