హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌‌‌లో చేరికలు

NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ మండిపడ్డారు. ఆదివారం దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో గుడిపల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు యువకులు రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.