JN: పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు చండి అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు పంచామృత అభిషేకం, కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
దుర్గాదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం


