హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా రాముల వారి నిత్య కళ్యాణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఆదివారం నిత్య కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. ప్రధానాలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, సీతారాముల ఉత్సవమూర్తులను కల్యాణ మండపానికి తీసుకువచ్చి అమ్మవార్లకు నూతన పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.