ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామ సర్పంచ్ అరుణ కుమార్ తండ్రి సుదర్శన్ ప్రమాదవశాత్తు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు.
తెలంగాణ
సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఆడే గజేందర్


