హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మాజీ మంత్రి

MBNR: రాజాపూర్ మండలం నాన్ చెరువు తండాలో నేడు మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో తండా ప్రజలకు తాగునీటి సౌకర్యం మెరుగుపడనుంది. స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో వాటర్ ప్లాంట్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.