హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలేజీ ముందు SFI నాయకుల ఆందోళన

HYD: నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ ముందు ఎస్‌ఎఫ్‌ఐ, కమ్యూనిస్టు సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. దాండియా వేడుకల్లో లైటింగ్‌ సిస్టమ్‌ కూలి విద్యార్థిని మృతి చెందడంపై నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.