JGL: గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి శ్రీ దుర్గా భవాని ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు మహా గౌరీ రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భవాని దీక్షపరులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ
మహా గౌరీ రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారు


