హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మంగళవారమే దసరా పండగను జరుపుకోవాలి'

JN: దసరా పండుగను మంగళవారం జరుపుకోవడంలో ఎలాంటి సందేహం లేదని, భక్తులు ఎవరు కూడా ఆపోహ పడకుండా పండగను యధావిధిగా జరుపుకోవాలని కొడకండ్ల మండల అమ్మవారి ఆలయ సిద్ధాంతకర్త పాలకుర్తి గౌతం శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయుధ పూజకు ఎలాంటి భంగం కలగదని తెలిపారు. ఆచరణ ప్రకారం మంగళవారమే పండగను నిర్వహించుకోవాలని సూచించారు.