SDPR: కోహెడ మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. సర్పంచ్ బోయిని సంపత్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సేవల్లో కీలకపాత్ర పోషిస్తున్న సిబ్బందిని పండుగ వేళ గౌరవిస్తూ.. కానుకలు అందించడం పట్ల హర్షం వ్యక్తమైంది.
తెలంగాణ
గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలు కానుక


