హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వేతనాల కోసం కార్మికుల ఎదురుచూపులు'

MHBD: దంతాలపల్లి మండల పరిధిలోని గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు నెల ముగిసి 17 రోజులు గడిచినా వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.9,500 వేతనంతో పనిచేస్తున్న తమకు దసరా వేళ కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు వెంటనే చెల్లించాలని, మంత్రి సీతక్క జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.