హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాళరాత్రి రూపంలో జగన్మాత దర్శనం

HNK: పద్మాక్షి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం అమ్మవారికి పంచసూక్తాలు, నారాయణ ఉపనిషత్తుతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం కాళరాత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 12గంటలకు కాళరాత్రి హవనం, జాగరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రధాన పూజారి శంకర్ తెలిపారు.