నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో వారం రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరాలో జాప్యం జరుగుతోంది. కొద్దిపాటి నీరు మాత్రమే వస్తుండటంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపుల లీకేజీల వల్ల సరఫరాకు అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
దామరగిద్దలో మిషన్ భగీరథ నీటి కష్టాలు


