హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్కింగ్‌ కష్టాలు.. ప్రజలపై చలానాల మోత

KNR: కరీంనగర్‌లోని ఆసుపత్రులు, మాల్స్‌లో సరైన పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడంతో వినియోగదారులు, రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కింగ్‌ కోసం కేటాయించిన సెల్లార్లను ఇతర అవసరాలకు వినియోగిస్తుండటంతో వాహనాలను రోడ్లపైనే నిలపాల్సి వస్తోందని వాపోతున్నారు. పోలీసులు విధించే చలానాలతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.