హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరాకు ఊళ్లకు వెళ్లేవారికి డీఎస్పీ సూచనలు

VKB: దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ శనివారం సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు.