హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలు సమృద్ధిగా కురవాలని చండీ హోమం

ADB: ఆదిలాబాద్ రిమ్స్‌లోని మహా గణపతి ఆలయంలో ఆదివారం చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. సమయానికి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.