హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓంకార్‌కు ఘనంగా నివాళులు

MLG: మల్లంపల్లి మండలంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మద్దికాయల ఓంకార్ 18వ వర్ధంతి సభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గుండెబోయిన చంద్రయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగం, పౌర హక్కులు, మత సామరస్య పరిరక్షణకు వామపక్ష శక్తులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్లూరు వెంకన్న, బొమ్మిడి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.