BDK: ఆళ్లపల్లి మండలం రాయపాడు గ్రామంలో గ్రామీణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన నూతన హ్యాండ్ బోర్ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ
నూతన హ్యాండ్బోర్ ప్రారంభించిన MLA


