హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలి: మంత్రి పొంగులేటి

KMM: తెలంగాణలో బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మను ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. వేడుకల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.