హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ లైన్‌తో ప్రజలకు ప్రాణాపాయం

MBNR: బాలానగర్ మండలం బొడజానంపేటలో కజారియా సిరామిక్ టైల్స్ కంపెనీ సమీపంలోని 42 కేవీ విద్యుత్ లైన్‌తో ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై పలుమార్లు లైన్‌మెన్‌కు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు స్థల పరిశీలన చేసి, భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.