హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా బతుకమ్మ వేడుకలు

KMM: BRS కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు మహిళల ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో 350 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరై మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.