హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరిఖనిలో రహదారి పక్కన చెట్ల కొమ్మలు

PDPL: గోదావరిఖని పవర్‌హౌస్ కాలనీలో ప్రధాన రహదారి పక్కన చెట్ల కొమ్మలు పడేయడంతో స్థానికులు, రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నివాసాల సమీపంలో, రహదారి పక్కన వ్యర్థాలు పేరుకుపోవడంతో అసౌకర్యం నెలకొంది. అధికారులు స్పందించి చెట్ల కొమ్మలు, ఇతర వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.